అలా జరిగిందన్న భువి
చివరి ఓవర్ వేయాలని అనుకున్న నితిన్ రెడ్డి
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో టాపర్ రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించిది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాట్‌తో, అనంతరం బంతితో చెలరేగింది. ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది . అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఒకదశలో 201 పరుగుల భారీ స్కోర్‌ను అలవోకగా ఛేదించేలా కనిపించింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో పావెల్ అవుట్ కావడంతో 200 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్‌కు తెర పడింది.
ఈ మ్యాచ్ అనంతరం నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. చివరి ఓవర్‌ను తాను వేయాలనుకున్నానని, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ వేయడానికి రావడం చూసి, ఆగిపోయానని చెప్పాడు. ఈ మ్యాచ్‌ను గెలిపిస్తాడనే నమ్మకం కలిగిందని పేర్కొన్నాడు. ఇలాంటి మ్యాచ్‌లను ఎన్నో ఎదుర్కొన్న అనుభవం అతనికి ఉందని వ్యాఖ్యానించాడు.
ఈ మ్యాచ్‌లో తాము గెలుస్తామని అనుకోలేదని, డ్రా కావడమో లేక ఓడిపోవడమో ఖాయమని భావించానని అన్నాడు. చివరి బంతికి వికెట్ పడుతుందని అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చాడు. గత రెండు మ్యాచ్‌లల్లో హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తోందని నితీష్ రెడ్డి గుర్తు చేసుకున్నాడు.
ఇన్నింగ్‌ను నిర్మించడం, క్రీజ్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బౌలర్‌పై ఎదురుదాడికి దిగాలనేది తన గేమ్ ప్లాన్‌గా వివరించాడు. అదే సమయంలో యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ రావడంతో.. తన పని మరింత సులువైందని పేర్కొన్నాడు. నిజానికి- ఏడాది కాలంగా ఇలాంటి బ్యాటింగ్ అవకాశం కోసం ఎదురు చూస్తో వస్తోన్నానని, ఈ సీజన్‌లో లభించిన ఆ చాన్స్‌ను నిలబెట్టుకుంటోన్నానని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కూడా చేయగల నిజమైన ఆల్ రౌండర్‌గా ఎదగడం తన లక్ష్యమని వివరించాడు.
మ్యాచ్ అనంతరం భువి మాట్లాడుతూ, సన్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన సీనియర్ బౌలర్ భువికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.. చివరి ఓవర్ లో వికెట్ రావడంపై స్పందిస్తూ అలా జరిగిపోయిదంటూ కామెంట్ చేశాడు.