బెంగుళూరు- ఐపీఎల్ 16 వ సీజన్లో నేడు ఆర్ సి బి తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.. ఈ మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. ఇక 14 ఓవర్లలో హర్షల్ పటేల్ ఔట్ కాగా,ఆ వెంటనే మ్యాక్స్ వెల్ పెవిలియన్ కు చేరాడు.. ఆ తర్వాత మరో బంతికి దినేష్ కార్తిక్ కూడా ఔటయ్యాడు.. మాక్స్ వెల్, దినేష్ వికెట్లు కులదీప్ పడగొట్టగా, హర్షల్ వికెట్ అక్షర్ కు దక్కింది.. అంతకు ముందు మూడో వికెట్ గా లామ్ రోర్ ఔటయ్యాడు.. మార్ష్ బౌలింగ్ లో అవటైన లామ్ రోర్ 26 పరుగులు చేశాడు. అంతకు ముందు ఆర్ సి బి ఓపెనర్లు డుప్లెసిస్, కోహ్లీలు ధనాధన్ బ్యాటింగ్ తో ఆటను ప్రారంభించారు.. అయితే అయిదో ఓవర్లో డుప్లెసిస్ 22 పరుగులు చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్ లో అవుటయ్యాడు.. తొలి వికెట్ 42 పరుగుల వద్ద పడింది..ఇక మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ ఫోర్లు,సిక్సర్లతో విరుచుకుపడ్డాడు… 33 బంతులలో ఆరు ఫోర్లు,ఒక సిక్స్ తో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.. అనంతరం లలిత్ యాదవ్ బౌలింగ్ 50 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక మూడో వికెట్ గా లామ్ రోర్ వెనుతిరిగాడు. మ్యాక్స్ వెల్ 24 పరుగులు , హర్షల్ 6 పరుగులు, దినేష్ సున్న పరుగులు పెవిలియన్ కు చేరారు.. 15 ఓవర్లు ముగిసే నాటికి ఆరు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది ఆర్సీబి ..
జట్ల వివరాలు
డిల్లీ క్యాపిటల్స్
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, యష్ ధూల్, మనీష్ పాండే , అక్షర పటేల్,లలిత్ యాదవ్, అమన్ ఖాన్, అభిషేక్ పొరేల్, కులదీప్ యాదవ్, నోర్ట్జి, ముస్తాఫాజుర్ ఖాన్
సబ్ – పృథ్వీ షా,ముఖేష్ కుమార్, ప్రవీణ్ డూబే, సర్ఫరాజ్ ఖాన్, చేతన్ సకారియా
ఆర్సీబి
డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, షాబాజ్ అహ్మాద్, దీనేష్ కార్తీక్, హసరంగ, హర్షల్ పటేల్, పర్నేల్, సిరాజ్, విజయ్ కుమార్
సబ్ – సుయేష్ ప్రభుదేశాయ్, డివిల్ విల్లీ,అకాష్ దీప్ ,కరణ్ శర్మ,అన్జూ రావత్