Tuesday, November 19, 2024

IPL | ఒకే జెర్సీలో మూడు జట్లు.. అయోమయంలో అభిమానులు!

ఐపీఎల్ 17వ సీజన్ మరో మూడు రోజుల్లో (22 నుంచి) ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఈ సీజన్ కోసం అన్ని జట్లు తమ సన్నాహాలను ప్రారంభించాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో.. జెర్సీ ఆవిష్కరణ, థీమ్ సాంగ్స్.. ప్రాక్టీస్ మ్యాచ్ లతో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లో మూడు ఫ్రాంచైజీలు ఒకే రకమైన జెర్సీని ఆవిష్కరించాయి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీలు ఒకే తరహాలో ఉన్నాయి.

ఈ మూడు జట్ల జెర్సీలను చూసి అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. జెర్సీల రంగులు దొరకలేదా..? అనుకోకుండా ఇలా జరిగిందా..? అని కామెంట్ చేస్తున్నారు. ఈ మూడు జట్లు ఒకరికొకరు తలపడ్డప్పుడు అభిమానులు, అంపైర్లు కన్‌ఫ్యూజ్ కావడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు జట్ల జెర్సీలకు సంబంధించి నెట్టింట జోకులు పేలుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement