భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడే జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15మంది సభ్యుల జట్టులో కెమర్‌రోచ్, బోన్నర్, బ్రాండన్‌కింగ్ వన్డే జట్టుకు ఎంపికయ్యారు. 2019లో భారత్‌పై చివరి వన్డే ఆడిన కెమర్‌రోచ్ రెండేళ్ల అనంతరం వన్డేజట్టుకు ఎంపికయ్యాడు.బోన్నర్, డారెన్ బ్రావో చోటు దక్కించుకోగా కీరన్ పొలార్డ్ సారథిగా వ్యవహరించనున్నాడు. సొంతగడ్డపై వెస్టిండీస్ ఐర్లాండ్చేతిలో ఓటమిపాలవడంతో విండీస్ జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా విండీస్ నూతన సెలెక్టర్ డెస్మండ్ హెన్స్ మాట్లాడుతూ 2023లో భారత్ వేదికగా జరగనునన ప్రపంచకప్ లక్ష్యంగా జట్టును ఎంపికచేసినట్లు ప్రకటించాడు. మూడు టీ20 సిరీస్‌లో ఆడే జట్టును నేడు ఎంపిక చేయనున్నామని హెన్స్ తెలిపాడు.
భారత్-వెస్టిండీస్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6, 9, 11తేదీల్లో జరగనుంది. అనంతరం కోల్‌కతా వేదికగా ఫిబ్రవరి 16, 18, 20వ తేదీల్లోమూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. భారతజట్టుకు కెప్టెన్‌గా రోహిత్‌శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నారు.
వెస్టిండీస్ వన్డే జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, స్క్రుమా బోన్నర్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, జేసన్ హోల్డర్, షాయ్‌హోప్, అకెల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్‌కింగ్, నికోలస్ పూరన్, కెమర్‌రోచ్, రొమారియో స్మిత్, హెడెన్ షెపర్డ్, ఒడియాన్డెన్, వాల్ష్ జూనియర్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..