Saturday, November 23, 2024

టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ ఇదే..

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. అక్టోబర్‌ 16నుంచి నవంబర్‌ 13వరకూ ఆస్ట్రేలియాలో ఈ మెగాటోర్నీ జరగనుంది. మొత్తం 45మ్యాచ్‌లు ఏడు వేదికలు..అడిలైడ్‌, గీలాంగ్‌, బ్రిస్బేన్‌, హోబర్ట్‌, మెల్‌బోర్న్‌, పెర్త్‌, సిడ్నీలలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తొలి రౌండులో మొదటి మ్యాచ్‌ 2014 ఛాంపియన్‌ శ్రీలంక-నమీబియా మధ్య జరగనుంది. సూపర్‌ 12 స్టేజ్‌ దశ తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది. గ్రూప్‌-2లో భారత్‌ తొలిమ్యాచ్‌లో పాక్‌తో తలపడనుంది. గ్రూప్‌-2లో భారత్‌తోపాటు పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్లు ఒకరితో ఒకరు తలపడనున్నాయి. అక్టోబర్‌ 23న చిరకాల ప్రత్యర్థులు మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ తలపడనున్నాయి. నవంబర్‌ 9న తొలి సెమీఫైనల్‌, నవంబర్‌ 10న రెండో సెమీఫైనల్‌ అనంతరం మెల్‌బోర్న్‌ వేదికగా నవంబర్‌ 13న ఫైనల్‌ జరగనుంది. కాగా గత పొట్టి ప్రపంచకప్‌లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా తొలిసారి దాయాది పాక్‌ చేతిలో ఓటమిపాలైంది. కోహ్లీ కెప్టెన్సీకి వీడ్కోలు పలకడంతో ఈ ఏడాది జరిగే ప్రపంచకప్‌కు హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ సారథిగా, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకంలో ఐసీసీ ట్రోఫీలో ఆడనుంది. మొత్తం 16జట్లు టైటిల్‌ కోసం పోరాడనున్నాయి.

మొదటి రౌండ్‌
అక్టోబర్‌ 16 ఆదివారం శ్రీలంక వర్సెస్‌ నమీబియా
అక్టోబర్‌ 16 ఆదివారం క్వాలిఫయర్‌2 వర్సెస్‌ క్వాలిఫయర్‌ 3
అక్టోబర్‌ 17 సోమవారం వెస్టిండీస్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌
అక్టోబర్‌ 17 సోమవారం క్వాలిఫయర్‌1 వర్సెస్‌ క్వాలిఫయర్‌ 4
అక్టోబర్‌ 18 మంగళవారం నమీబియా వర్సెస్‌ క్వాలిఫయర్‌ 3
అక్టోబర్‌ 18 మంగళవారం శ్రీలంక వర్సెస్‌ క్వాలిఫయర్‌ 2
అక్టోబర్‌ 19 బుధవారం స్కాట్లాండ్‌ వర్సెస్‌ క్వాలిఫయర్‌ 4
అక్టోబర్‌ 19 బుధవారం వెస్టిండీస్‌ వర్సెస్‌ క్వాలిఫయర్‌1
అక్టోబర్‌ 20 గురువారం శ్రీలంక వర్సెస్‌ క్వాలిఫయర్‌ 3
అక్టోబర్‌ 20 గురువారం నమీబియా వర్సెస్‌ క్వాలిఫయర్‌ 2
అక్టోబర్‌ 21 శుక్రవారం వెస్టిండీస్‌ వర్సెస్‌ క్వాలిఫయర్‌ 4
అక్టోబర్‌ 21 శుక్రవారం స్కాట్లాండ్‌ వర్సెస్‌ క్వాలిఫయర్‌ 1

సూపర్‌-12
అక్టోబర్‌ 22 శనివారం న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా
అక్టోబర్‌ 22 శనివారం ఇంగ్లండ్‌ వర్సెస్‌ అఫ్గనిస్థాన్‌
అక్టోబర్‌ 23 ఆదివారం గ్రూప్‌-ఎ విజేత వర్సెస్‌ గ్రూప్‌-బి రన్నరప్‌
అక్టోబర్‌ 23 ఆదివారం భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌
అక్టోబర్‌ 24 సోమవారం బంగ్లాదేశ్‌ వర్సెస్‌ గ్రూప్‌-ఎ రన్నరప్‌
అక్టోబర్‌ 24 సోమవారం సౌతాఫ్రికా వర్సెస్‌ గ్రూప్‌-ఎ విన్నర్‌
అక్టోబర్‌ 25 మంగళవారం ఆస్ట్రేలియా వర్సెస్‌ గ్రూప్‌-ఎ విన్నర్‌
అక్టోబర్‌ 26 బుధవారం ఇంగ్లండ్‌ వర్సెస్‌ గ్రూప్‌-బి రన్నరప్‌
అక్టోబర్‌ 26బుధవారం న్యూజిలాండ్‌ వర్సెస్‌ అఫ్గనిస్థాన్‌
అక్టోబర్‌ 27 గురువారం దక్షిణాఫ్రికా వర్సెస్‌ బంగ్లాదేశ్‌
అక్టోబర్‌ 27 గురువారం భారత్‌ వర్సెస్‌ గ్రూప్‌-ఎ రన్నరప్‌
అక్టోబర్‌ 28 శుక్రవారం అఫ్గనిస్థాన్‌ వర్సెస్‌ గ్రూప్‌-బి రన్నరప్‌
అక్టోబర్‌ 28 శుక్రవారం ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా
అక్టోబర్‌ 29 శనివారం న్యూజిలాండ్‌ వర్సెస్‌ గ్రూప్‌-ఎ విన్నర్‌
అక్టోబర్‌ 30 ఆదివారం బంగ్లాదేశ్‌ వర్సెస్‌ గ్రూప్‌-బి విన్నర్‌
అక్టోబర్‌ 30 ఆదివారం పాకిస్థాన్‌ వర్సెస్‌ గ్రూప్‌-ఎ రన్నరప్‌
అక్టోబర్‌ 31 సోమవారం ఆస్ట్రేలియా వర్సెస్‌ గ్రూప్‌-బి రన్నరప్‌
నవంబర్‌ 1 మంగళవారం అఫ్గనిస్థాన్‌ వర్సెస్‌ గ్రూప్‌-ఎ విన్నర్‌
నవంబర్‌ 1 మంగళవారం ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌
నవంబర్‌ 2 బుధవారం గ్రూప్‌-బి విన్నర్‌-గ్రూప్‌-ఎ రన్నరప్‌
నవంబర్‌ 2 బుధవారం భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌
నవంబర్‌ 3 గురువారం పాకిస్థాన్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా
నవంబర్‌ 4 శుక్రవారం న్యూజిలాండ్‌ వర్సెస్‌ గ్రూప్‌-బి రన్నరప్‌
నవంబర్‌ 4 శుక్రవారం ఆస్ట్రేలియా వర్సెస్‌ అఫ్గనిస్థాన్‌
నవంబర్‌ 5 శనివారం ఇంగ్లండ్‌ వర్సెస్‌ గ్రూప్‌-ఎ విన్నర్‌
నవంబర్‌ 6 ఆదివారం దక్షిణాఫ్రికా వర్సెస్‌ గ్రూప్‌-ఎ రన్నరప్‌
నవంబర్‌ 6 ఆదివారం పాకిస్థాన్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌
నవంబర్‌ 6 ఆదివారం భారత్‌ వర్సెస్‌ గ్రూప్‌-ఎ విన్నర్‌
నవంబర్‌ 9 బుధవారం సెమీఫైనల్‌-1
నవంబర్‌ 10 గురువారం సెమీఫైనల్‌ -2
నవంబర్‌ 13 ఆదివారం ఫైనల్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement