భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో తలపడే లంక జట్టును శ్రీలంక సెలక్షన్ కమిటీ ప్రకటించింది. లంక జట్టుకు దిముత్ కరుణరత్నే సారథ్యం వహించనున్నాడు. 2017 తర్వాత భారత్‌లో శ్రీలంక జట్టు టెస్టు సిరీస్ ఆడనుండటం ఇదే ప్రథమం. టెస్టు సిరీస్‌కు ఆల్‌రౌండర్ హసరంగా దూరమవగా సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ జట్టులో చేరాడు. భారత్-శ్రీలంక మధ్య జరిగే తొలి టెస్టు మొహాలీ వేదికగా మార్చి 4న ప్రారంభం కానుంది.
శ్రీలంక టెస్టు జట్టు: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), పాతుమ్ నిశాంక, లహిరు తిరిమాన్నే, ధనంజయ డిసిల్వా (వైస్ కెప్టెన్), కుశాల్ మెండీస్, ఎంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమాల్, చరిత్ అసలెంక, చమిక కరుణరత్నే, రమేశ్ మెండీస్, లాహిరుకుమార, సురంగ లక్మల్, దుష్మంత చమీర, విశ్వ ఫెర్నాండో, జెఫ్రీ, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్డేనియా.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..