సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ జట్టు ఘోర ఓటమి చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, టెస్టు చరిత్రలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. దీంతో పాక్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండు, మూడు టెస్టులకు స్టార్ క్రికెటర్లపై వేటు వేస్తూ ఆదివారం జట్టును ప్రకటించింది.
షాన్ మసూద్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును పాక్ బోర్డు ప్రకటించింది. స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు అనుభవజ్ఞులైన షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్‌లను పాక్ సెలక్షన్ కమిటీ జట్టు నుంచి తప్పించింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గుహ్లామ్‌లతో పాటు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సజీద్ ఖాన్‌లకు అవకాశం ఇచ్చింది.
ఇంగ్లండ్‌తో 2,3 టెస్టులకు పాకిస్థాన్ జట్టు:
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నోమన్ అలీ, సయిమ్ అయుబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, జాహిద్ మెహమూద్.