ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్-2023-24 కోసం హాకీ ఇండియా పటిష్టమైన స్క్కాడ్‌ను ప్రకటించింది. భారత గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భువనేశ్వర్, రూర్కెలా వేదికలుగా మారాయి. కాగా, ఇవ్వాల (గురువారం) భారత హాకీ సమాఖ్య మొత్తం 24 మందితో కూడిన పురుషుల జట్టును ఎంపిక చేసింది.
ఈ జట్టుకు హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తుండగా.. హార్దిక్ సింగ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టీమ్‌లో ఇద్దరు గోల్ కీపర్లు, 8 మంది డిఫెండర్లు, ఏడుగురు మిడ్ ఫీల్డర్లు, ఏడుగురు ఫార్వర్డర్లు ఉన్నారు. అరైజీత్ సింగ్ హుందాల్, విష్ణుకాంత్ సింగ్‌లు కూడా భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత జట్టు స్పెయిన్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇర్లాండ్ జట్లతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ పటిష్టమైన స్పెయిన్‌తో ఢీ కొననుంది.
భారత హాకీ జట్టు ఇదే
గోల్ కీపర్లు: శ్రీజేష్ పరట్టు రవీంద్రన్, క్రిష్ణన్ బహాదుర్ పాఠక్.
డిఫెండర్లు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, అమిత్ రొహిదాస్, సుమిత్, సంజయ్, జగ్‌రాజ్ సింగ్, విష్ణుకాంత్ సింగ్.
మిడ్‌ఫీల్డర్లు: వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, మన్‌ప్రీత్ సింగ్, షంషేర్ సింగ్, హార్దిక్ సింగ్ (వైస్ కెప్టెన్), రాజ్‌కుమార్ పాల్, రబిచంద్ర సింగ్.
ఫార్వర్డర్లు: మందీప్ సింగ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, గుర్జంత్ సింగ్, అకాశ్ దీప్ సింగ్, అరైజీత్ సింగ్ హుందాల్.