మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో టీమిండియా చిత్తు చిత్తుగా ఓడింది. తొలి రెండు టెస్టుల్లోనూ ఓడి సిరీస్ ను కోల్పోయిన భారత్.. వాంఖడే వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ ఖంగుతింది. 147 పరుగుల టార్గెట్ ను కూడా ఛేజ్ చేయలేకపోయింది. ఫలితంగా మూడో టెస్టులో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 121 పరుగులకు ఆలౌటైంది.రిషభ్ పంత్ (57 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు.
అతడు తప్ప మిగిలిన బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఫలితంగా భారత్ వైట్ వాష్ అయ్యింది. కివీస్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ 6 వికెట్లతో భారత్ నడ్డి విరిచాడు. గ్లెన్ ఫెలిప్స్ 3 వికెట్లతో మెరిశాడు. మరో వికెట్ మ్యాట్ హెన్రీకి లభించింది.