Friday, November 22, 2024

Third Test – ఇంగ్లండ్ ఘోర ఓటమి… 434 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం..

రాజ్‌కోట్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై 434 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌..  122కే ఆలౌటైంది.  క్రాలే(11), బెన్‌స్ట్రోక్‌(15),  బెన్‌ ఫోక్స్‌(16), హార్ట్‌లీ(16), మార్క్‌ వుడ్‌(33) జేమ్స్‌ అండర్సన్‌(1), పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.  భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 , కుల్దీప్‌ 2, బుమ్రా , అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.

య‌శ‌స్వీ జైస్వాల్ ద్విశ‌త‌కం….

అంతకు ముందు భార‌త యువ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(213 నాటౌట్: 235 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స‌ర్లు) రెండో డబుల్ సెంచ‌రీ కొట్టాడు. అరంగేట్రం బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌(51 నాటౌట్ : 67 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్) వ‌రుస‌గా రెండో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ఇద్ద‌రూ దూకుడుగా ఆడుతున్న స‌మ‌యంలోనే 430/4 వ‌ద్ద‌ భార‌త కెప్టెన్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో, ఇంగ్లండ్‌కు 557 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

మూడో రోజు టీ20 త‌ర‌హా ఆట‌తో సెంచ‌రీ బాదిన ఈ హిట్ట‌ర్.. నాలుగో రోజు ఇంగ్లండ్ బౌల‌ర్ల‌పై ఉప్పెన‌లా విరుచుకుప‌డ్డాడు. జో రూట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి య‌శ‌స్వీ ద్వి శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. లంచ్ త‌ర్వాత దూకుడు పెంచిన య‌శ‌స్వీ.. జేమ్స్ అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స‌ర్లతో త‌న త‌డాఖా చూపించాడు. తొలి సెషన్‌లో శుభ్‌మ‌న్ గిల్(91) ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన ఈ డాషింగ్ బ్యాట‌ర్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement