ఇండియా , ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో ఆతిధ్య జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది..
7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో అదరగొట్టారు. ఈ క్రమంలో.. ఆసీస్ భారీ స్కోరు చేసింది.
రెండో రోజు తొలి సెషన్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో సెషన్ మొత్తం ఆస్ట్రేలియాదే కొనసాగింది. ఈ ఇద్దరి బ్యాటర్లను పెవిలియన్ కు పంపేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ట్రావిస్ హెడ్ మరోసారి టీమిండియాకు తలనొప్పిగా మారాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో రోజు రెండో సెషన్‌లో సెంచరీ చేసి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. భారత్‌పై టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు మూడు సెంచరీలు సాధించాడు. పింక్ బాల్ టెస్టులో సెంచరీ కూడా సాధించాడు. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కేరీ (45*), మిచెల్ స్టార్క్ (7*) ఉన్నారు.
భారత బౌలర్లలో బుమ్రా మరోసారి చెలరేగాడు. బౌలింగ్ లో 5 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు వికెట్లు తీయనప్పటికీ.. బుమ్రా వికెట్ల కోసం పోరాడుతూనే ఉన్నాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ దక్కగా.. మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.