Thursday, November 21, 2024

Sunil Gavaskar : వాళ్ల‌కు జీతాలు క‌ట్ చేయాల్సిందే…

ఐపీఎల్ 2024 సీజన్‌ పూర్తవ్వకుండానే స్వదేశం వెళ్లిపోయే ఆటగాళ్లపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా మధ్యలోనే వెళ్లే ఆటగాళ్ల జీతాల్లో కోత విధించాలని సూచించాడు. టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను స్వదేశానికి రావాలని ఆదేశించింది.

- Advertisement -

ఇంగ్లండ్‌తో పాటు ఇతర దేశాలు సైతం తమ ఆటగాళ్లను వెనక్కి రప్పించుకుంటున్నాయి. దాంతో ప్లే ఆఫ్స్ చేరిన జట్లు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోనున్నాయి. ఈ క్రమంలోనే ఇలా మధ్యలో వెళ్లే ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ నిర్వాహకులు పునరాలోచన చేయాలని గవాస్కర్ సూచించాడు. ‘ఆటగాళ్లు తమ దేశానికి ప్రాధాన్యమివ్వడంలో తప్పు లేదు. కానీ పూర్తి సీజన్ ఆడుతామని ఫ్రాంచైజీలతో ఒప్పందాలు కుదుర్చుకొని మధ్యలోనే వెళ్లిపోవడం సరికాదు. ఆ ఆటగాళ్ల దేశం తరఫున కొన్ని సీజన్లలో సంపాదించే మొత్తం కన్నా ఐపీఎల్ ద్వారా ఆర్జించే డబ్బే ఎక్కువ. మధ్యలో వెళ్లిపోయిన ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలి.

ఈ విషయంలో ఐపీఎల్ నిర్వాహకులు ఫ్రాంచైజీలకు పూర్తి స్వేచ్చనివ్వాలి. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని వారి బోర్డులకు కమీషన్‌గా ఇవ్వడమూ కూడా ఆపేయాలి.’అని సునీల్ గవాస్కర్ సూచించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement