వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెజెండరీ క్రికెటర్లు ఈ టోర్నీ ఆడనున్నారు. లెజెండ్స్ లీగ్ రేపటి (జూలై 3) నుంచి జూలై 13 వరకు జరుగుతుంది. ఇంగ్లండ్, ఇండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్,దక్షిణాఫ్రికాకు చెందిన లెజెండ్స్ జట్లు ఈ పోటీలో టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
ఇక భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జూలై 6న ఎడ్జ్ బాస్టన్‌లో జరగనుంది. భారత జట్టుకు యువరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, పాకిస్థాన్ జట్టుకు షాహిద్ అఫ్రిది నాయకత్వం వహించనున్నాడు. మ్యాచ్‌లు ప్రతిరోజూ మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటలకు జరుగుతుంది. మరో మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు జరగనుంది.
ఈ లీగ్‌లో మొత్తం 10 రోజుల పాటు 18 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒక్కో జట్టు మిగతా ఐదు జట్లతో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఒకసారి ఆడుతుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్ ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. లీగ్ దశల్లో టాప్ 4 జట్లు జూలై 12న సెమీ ఫైనల్స్‌కు ఆడనున్నాయి. ఫైనల్ జూలై 13న జరుగుతుంది.