ఇటీవల ఆస్కార్ అవార్డు పొందిన డాక్యుమెంటరీ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’లో నటించిన బొమ్మన్, బెల్లి చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొమ్మన్, బెయిలీలకు ధోనీ వారి పేర్లతో కూడిన ఏడో నంబర్ జెర్సీని గిప్ట్nగా ఇచ్చాడు. ధోనీ ఆస్కార్ అవార్డుతో ఫొటోకు ఫోజులిచ్చాడు. మిస్టర్ కూల్ తనయ జీవా సైతం ఆస్కార్ విన్నింగ్ చిత్ర బృందంతో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్కే ‘ప్రత్యేక వ్యక్తులతో ప్రత్యేక్ష క్షణం’ అంటూ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మా హృదయాలను గెలుచుకున్న చిత్రబృందానికి ప్రశంసలు! బొమ్మన్, బెల్లి, నిర్మాత కార్తికీ గోన్సాల్వేస్ను కలుసుకోవడం బాగుంది’ అని తెలిపింది. ది ఎలిఫెంట్ విస్పర్స్లో బొమ్మన్, బెల్లి ఏనుగుల సంరక్షకులుగా నటించారు. ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు. గునీత్ మోంగా, కార్తికీ గోన్సాల్వేస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.