ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో ఈ రోజు మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా బీ.. ముషీర్ ఖాన్ (373 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 181) భారీ శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగుల భారీ స్కోర్ చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ముషీర్ ఖాన్.. టెయిలెండర్ నవ్‌దీప్ సైనీ (144 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీ సాయంతో 8వ వికెట్‌కు 205 పరుగులు జోడించాడు. దీంతో ఇండియా బీ తొలి ఇన్నింగ్స్ లో 321 పరుగులు బాదింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా ఏ నిలకడగా ఆడుతోంది. మయాంక్ అగర్వాల్(36), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(25) విఫలమైనా.. రియాన్ పరాగ్(27 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(23 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు. నవ్‌దీప్ సైనీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి ఇండియా ఏ 187 పరుగుల వెనుకంజలో ఉంది.