పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ల పోరాటం ముగిసింది. అద్భుత ప్రదర్శనతో పతక ఆశలు రేకిత్తించిన లోవ్లినా బోర్గోహైన్.. 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. చైనీస్ బాక్సర్ లి కియాన్‌తో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లోవ్లినా 1-4తో పరాజయం పాలైంది. ఇక భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన నిఖత్ జరీన్ రెండో రౌండ్ లోనే పరాజయం పాలైంది. నేడు లోవ్లినా ఓటమితో పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ల పోరాటం ముగిసింది.
పురుషుల బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. 71 కేజీల విభాగంలో పోటీ పడిన నిశాంత్ దేవ్.. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే 4-1 తేడాతో నిశాంత్ దేవ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ తొలి రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శించిన నిశాంత్ దేవ్.. వరుసగా రెండు రౌండ్లలో మెరుగైన ప్రదర్శన కనబర్చినా.. జడ్జీలు ప్రత్యర్థి బాక్సర్‌కు అనుకూలమైన తీర్పు ఇచ్చారు.