బహమాస్ : అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెట్లు మరోసారి మెరిసారు. బహమాస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత మహిళా, పురుషుల జట్లు చిరస్మరణీయ ప్రదర్శనలతో పారిస్ ఒలింపిక్స్- 2024 బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి. సోమవారం జరిగిన మహిళల విభాగం 4400 మీటర్ల రిలే టీమ్ ఈవెంట్ రెండో రౌండ్ హాట్స్‌లో రూపల్ చౌదరీ, ఎంఆర్ పూవమ్మ, జ్యోతికా శ్రీ దండి, సుభా వెంకటేశన్‌లతో కూడిన భారత బృందం రేస్‌ను 3:29.35 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు జమైకా అమ్మాయిలు ఈ పరుగును 3:38.54 సెకన్లలో పూర్తి చేసి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
అద్భుత ప్రదర్శనలు చేసిన భారత్, జమైకా జట్లు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి. ఇక్కడ జరిగిన పురుషుల 4400 మీటర్స్ ఈవెంట్‌లో భారత స్టార్ అథ్లెట్లు మహ్మద్ అనస్ యహియా, మహ్మద్ అజ్మల్, ఆరోకియా రాజీవ్, అమోజ్ జాకబ్‌లు ఈ రేస్‌ను 3:3.23 సెకన్లలో పూర్తి చేసి తమ హీట్స్‌లో రెండో స్థా నంలో నిలిచారు. మరోవైపు అమెరికా జట్టు 2:59.95 సెకన్స్ లో రేస్‌ను పూర్తి చేసి తొలి స్థానా న్ని దక్కించుకుంది. దాంతో తమ హీట్స్‌లో టాప్-2లో నిలి చిన అమెరికా, భారత్ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.