టెస్టు క్రికెట్‌లో ఇటీవల ఇంగ్లండ్ జట్టు అద్భుత విజయం నమోదు చేస్తోంది. బాజ్‌బాల్ ఆటతో ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తోంది. తాజాగా సొంతగడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ ఇంగ్లండ్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. బలమైన కంగారూలపై బాజ్‌బాల్ ఆటతో సిరీస్ సమం చేసుకుంది. అయితే ఇంగ్లండ్ జట్టు అనుసరిస్తున్న బాజ్‌బాల్ గేమ్‌కు భారత పిచ్‌లపై అసలౌన సవాల్ ఎదురుకానుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ పేర్కొన్నాడు. బెన్ట్ స్టోక్స్ బృందం భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంపై బాజ్‌బాల్ సక్సెస్ ఆధారపడి ఉందని తెలిపారు.
‘బాజ్‌బాల్ గేమ్ ఒక జట్టుపైనే పనిచేస్తుందని కొందరు అన్నారు, అంటున్నారు… కానీ ఇంగ్లండ్ ఇటీవల న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై అద్భుత విజయాలు సాధించింది. ఇక మిగిలింది భారతే. ఇది బాజ్‌బాల్‌కు స్పిన్‌కు మధ్య జరిగే పోరాటం. బాజ్‌బాల్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. అందుకని ఇంగ్లండ్ – భారత్ టెస్టు సిరీస్ రసవత్తరంగా ఉండనుంది. సొంతగడ్డపై టీమిండియా కఠిన ప్రత్యర్థి అనే విషయం తెలిసిందే” అని హుస్సేన్ పేర్కొన్నారు. ఇంగ్లండ్ జట్టు 2024 జనవరిలో భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే.