పశ్చిమ బెంగాల్‌లో ఓ ఫుట్‌బాలర్ కన్నుమూశాడు. ఫుట్‌బాల్ బలంగా తగలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగాల్ ఫుట్‌బాల్ యువ ఆటగాడు దేబోజ్యోతి (25) శనివారం దబులియా బెల్పుకూర్ మైదానంలో నబాబ్దిప్ సేవక్ సమితి, కృష్ణా నగర్ సెంట్రల్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొన్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో దేబోజ్యోతికి ఫుట్‌బాల్ బలంగా తగిలింది. దీంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. వాంతులు చేసుకున్న అతన్ని.. మెరుగైన చికిత్స కోసం షక్రిగఢ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు తెలిపారు.
గుండెపోటుతోనే దేబోజ్యోతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. గతంలో సంతోష్ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించిన దేబోజ్యోతి.. కోల్‌కతా ఫుట్‌బాల్ లీగ్‌లో రైలేస్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కెనడియన్ ఫుట్‌బాల్ 2022 కోసం కూడా అతన్ని ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ అధికారులు ఎంపిక చేశారు. ఈ హఠాత్పరిణామంతో మిగిలిన ఆటగాళ్లంతా కన్నీరుమున్నీరయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..