Saturday, January 11, 2025

Malaysian Open | సెమీస్‌కి దూసుకెళ్లిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ

మలేషియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 2025 సీజన్‌ను తెలుగబ్బాయి సాత్విక్‌ సాయిరాజ్‌ తన సహచరుడు చిరాగ్‌ శెట్టితో కలిసి దూకుడుగా ప్రారంభించాడు. వీరు కొత్త సీజన్‌ తొలి టోర్నీలో హ్యాట్రిక్‌ విజయాలతో జోరు ప్రదర్శిస్తున్నారు.

శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ జోడీ 26-24, 21-15 తేడాతో ఓంగ్‌ యె సిన్‌-యి టియో (మలేషియా) జంటపై విజయం సాధించి టోర్నీలో ముందంజ వేశారు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ద్వయం చెమటోడ్చి నెగ్గింది.

ఇక శనివారం జరిగే సెమీస్‌ పోరులో భారత జోడీ దక్షిణా కొరియాకు చెందిన వాన్‌ హో కిమ్‌-సియో సీయుంగ్‌ జే జంటతో అమీతుమీ తేల్చుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement