ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బుధవారం విడుదలయ్యాయి. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి ఒకే ఒక్కడు ఉన్నాడు. అది కూడా పదో ర్యాంకులో కొనసాగుతున్న ఆ ఆటగాడే కేఎల్ రాహుల్ (646). టీమిండియా పరువు కాపాడిన వాడుగా నిలిచాడు. అయితే టీ20 బ్యాటింగ్ జాబితాలో పాక్ క్రికెటర్ల హవా కొనసాగింది. అటు బౌలింగ్‌లోనే వారే మెరుస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (818) అగ్ర స్థానంలో ఉండగా.. అదే జట్టు స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (794) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్కమ్ (796) రెండో స్థానంలో, ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ (728) మూడో స్థానంలో, కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (703) నాల్గో స్థానంలో, ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (692) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా దక్షిణాఫ్రికా ఆటగాడు డస్సెన్ (669), కివీస్ వెటరన్ ఓపెనర్ గప్తిల్ (658), శ్రీలంక ప్లేయర్ పథుమ్ నిస్సంక (654) వరుసగా ఆరు నుంచి 9వ స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ (633) 14వ స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు 16, 19వ స్థానాల్లో ఉన్నారు.
బౌలింగ్ ఎవరూ లేరు…
ఇక బౌలింగ్ కేటగిరిలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రేస్ షంషీ 784 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఆదిల్ రషీద్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా, రషీద్ ఖాన్, వనిందు హసరంగ, ఎన్రిచ్ నోర్జే, ముజీబుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్, షాహీన్ అఫ్రిదీలు టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా నుంచి భువనేశ్వర్ కుమార్ 586 రేటింగ్ పాయింట్లతో 18వ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 10 జాబితాలో టీమిండియా నుంచి ఎవరూ లేకపోవడం గమనార్హం. ఆల్ రౌండర్ విభాగంలోనూ.. టీమిండియాకు పరాభావమే ఎదురైంది. ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ టాప్‌లో ఉండగా.. షకీబుల్ హసన్, మొయిన్ అలీ, జేజే స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, రోహన్ ముస్తఫా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జీషన్ మక్సూద్, ఎయిడెన్ మార్కమ్, దీపేంద్రలు టాప్ 10 జాబితాలో ఉన్నారు. ఈ విభాగం టాప్ 20లో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..