Monday, November 18, 2024

Big Breaking | బౌలింగ్​తో పాక్​ని బెదరగొట్టి నెదర్లాండ్స్​.. టార్గెట్​ ఎంతంటే!

వన్డే వరల్డ్​ కప్​లో నెదర్లాండ్స్, పాకిస్తాన్​ మ్యాచ్​లో పాక్​ 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వన్డే మ్యాచ్​లో మరో ఓవర్​ ఉండగానే పాక్​ని నెదర్లాండ్స్​ పెవిలియన్​కు పంపింది. ఇక 287 పరుగుల టార్గెట్​తో నెదర్లాండ్స్​ బ్యాటింగ్​కు దిగనుంది..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వన్డే వరల్డ్​ కప్​ సెకండ్​ మ్యాచ్ పాకిస్తాన్​, నెదర్లాండ్స్​ జట్ల మధ్య జరుగుతోంది.​ ఇవ్వాల (శుక్రవారం) హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్​లో తొలుత టాస్​ గెలిచిన నెదర్లాండ్స్​ జట్టు బౌలింగ్​ ఎంచకుంది.  చిన్న జట్టుగా పేరున్న నెదర్లాండ్స్​ ఆది నుంచి అటాకింగ్​ మోడ్​లో పాక్​పై విరుచుకుపడింది. ఆదిలోని టాపార్డర్​ను ఉక్కిరి బిక్కిరి చేసిన బౌలర్లు తొలి మూడు వికెట్లను స్పీడ్​గా పడగొట్టారు. అయితే.. వికెట్లను కాపాడుకుంటేనే పాక్​ బ్యాటర్లు పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఊహించినంత స్పీడ్​గా నెదర్లాండ్స్​ ఆట సాగలేదు. తొలి ఓవర్లలో ఉన్న స్పీడ్​ అంచనా బట్టి 100 పరుగులకే పాక్​ ఆలౌట్ అవుతుందనే అంచనా ఉండేది..

- Advertisement -

కానీ.. పాక్​ బ్యాటర్లు నెమ్మదిగా కుదురుకుని పరుగులు రాబట్టారు. ఇందులో మహ్మదర్​ రిజ్వాన్​ చాలా చాకచక్యంగా బౌండరీలు బాదుతూ నెదర్లాండ్స్​ బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా ఆడాడు. సాద్​ షకీ కూడా అదే తీరు ప్రదర్శించాడు. ఈ ఇద్దరి ఆటతీరుతో మొత్తం మ్యాచ్​ స్వరూపమే మారిపోయింది.

పాకిస్తాన్​ బ్యాటర్లలో ఫకర్​ జమాన్​ (12), ఇమాముల్​ హక్​ (15), బాబర్​ ఆజాం (5), మహ్మద్​ రిజ్వాన్​ (68), సౌద్​ షకీల్ (68), ఇఫ్తీకర్​ అమ్హద్​ (9), మహ్మద్​ నవాజ్​ (39), షాబాద్​ ఖాన్​ (32), హసన్​ అలీ (0), రవూఫ్​ (18) పరుగులు చేయగా.. షహీన్​ ఆఫ్రీది 13 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

ఇక.. నెదర్లాండ్స్​ బౌలర్లలో ఆర్యన్​ దత్​ 1, వాన్​బెక్​ 1, కొలిన్​ ఆకెర్​మన్​ 2, బాన్​ మెకరీన్​ 1 వికెట్లు తీయగా.. బాస్​ దె లీడే 4 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement