స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకుంది. వర్షం కారణంగా నేటి మ్యాచ రద్దవ్వడంతో 2-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది. నేటి మ్యాచ్లో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
పల్లెకెలె స్టేడియంలో నామమాత్రమైన మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ను వరుణుడు అడ్డుకున్నాడు. 21 ఓవర్లు ముగిసిన తురువాత వర్షం మొదలైంది… ఎంత సేపైనా వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో రెఫరీలు ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను శ్రీలంక జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది.