బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) రాజ్యాంగంలో కీలకమైన మార్పులు చేయడానికి ఇవ్వాల (బుధవారం) సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా మరోసారి ఆ పదవులు చేపట్టే వీలు కలిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరి పదవీ కాలం ముగిసిపోయింది. అయితే గతంలో ఆర్‌ఎం లోధా కమిటీ చేసిన సిఫార్సుల మేరకు బీసీసీఐ రాజ్యాంగంలో మార్పులు చేశారు.
దీని ప్రకారం రాష్ట్ర అసోసియేషన్, బీసీసీఐలో పదవులు చేపట్టిన వాళ్లు తిరిగి వెంటనే పోటీ చేయకుండా కొంతకాలం దూరంగా ఉండాలన్న నిబంధన ఉంది. దీనిని సవరించాలని కోరుతూ బీసీసీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ రోజు ఈ కీలక తీర్పు వెలువరించింది.