ఆస్ట్రేలియా, టీమిండియా రెండో మ్యాచ్‌లో ఇవ్వాల ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ఇక ఫటాఫట్ వికెట్లు తీసి ఆస్ట్రేలియా వెన్నువిరిచారు. కాగా, నిర్ణీత 8 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. దీంతో ఇండియా టార్గెట్ 91 గా ఉంది.
కాగా, 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్లో అక్షర్ పటేల్ బంతి అందకున్నాడు. తొలి బంతికి బౌండరీ బాదిన గ్రీన్.. మూడో బంతికి సింగిల్ తీసేందుకు యత్నించాడు. అక్షర్ వేసిన బంతిని మిడాన్ వైపు కొట్టి సింగిల్ తీసేందుకు యత్నించాడు. కానీ, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వెంటనే రియాక్ట్ అయ్యాడు.. బంతిని అక్షర్ పటేల్ వైపు విసిరాడు.
ఇక.. ఆ బంతి తన చేతుల్లోకి రాగానే వికెట్లను కూల్చిన అక్షర్.. గ్రీన్‌ను రనౌట్ చేశాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) కూడా డకౌట్ అయ్యాడు. అక్షర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడబోయిన మ్యాక్సీ.. దాన్ని పూర్తిగా మిస్ అయ్యాడు. దాంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆసీస్ జట్టు రెండు ఓవర్లలోనే 2 వికెట్టు కోల్పోయింది. ఆ తర్వాత కూడా మరో ఇద్దరు పెవిలియన్‌కు చేరారు. అయితే.. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ (8), మ్యాథ్యూ 43 నాటౌట్ కలిసి కాసేపు వికెట్లు పడకుండా జాగ్రత్త ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించారు.