దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు భారత జట్టు దుమ్మురేపుతొంది. వరుస విజయాలతో గ్రూప్ స్టేజ్‌లో అదరకొట్టిన టీమిండియా ఇప్పటికే సూపర్ సిక్స్ దశకు చేరుకుంది. ఇక, భారత్‌తో పాటు సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఆయా గ్రూపుల్లోని జట్లు తమ ప్రత్యర్థులతో రెండు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో భాగంగానే భారత జట్టు తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో యువ భారత్ రేపు బ్లూమ్‌ఫోంటైన్‌లో నేపాల్‌తో తలపడనుంది.
ఇక ఇప్పటికే జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన భారత జట్టు.. భారీ తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే, సూపర్ సిక్స్‌లోని రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 6, 8 తేదీల్లో జరగాల్సి ఉంది. ఫైనల్ ఫిబ్రవరి 11న జరుగుతుంది, మొత్తం మూడు నాకౌట్ గేమ్‌లు బెనోనిలో జరుగుతాయి.