ఐపీఎల్ ఫైనల్స్‌కి వర్షం అడ్డంకిగా మారింది. ఏడు గంటలకు వేయాల్సిన టాస్ దాటినా ఎలాంటి పురోగతి లేదు. అహ్మదాబాద్ స్టేడియం దగ్గర ఇంకా భారీ వర్షం కురుస్తుండడంతో టాస్తోపాటు మ్యాచ్ కూడా ఆలస్యం కానుంది. ఒకవేళ ఇవ్వాల కనుక ఆట కొనసాగకుంటే.. రేపు (సోమవారం) మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.
ఎందుకంటే సోమవారం రిజర్వ్ డేగా ప్రకటించింది బీసీసీఐ. ఇక.. రేపు కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉండి.. మ్యాచ్ ఆడే అవకాశం లేకుంటే కనుక.. కప్‌ని ఇరు జట్లు సమంగా షేర్ చేసుకోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై క్రికెట్ అనలిస్టులు, పరిశీలకులు ఇదే చెబుతున్నారు.