Wednesday, November 13, 2024

ఐపీఎల్‌ మినీ వేలానికి తేదీ ఖరారు.. వచ్చే ఏడాది డిసెంబర్‌ 16న డేట్​ ఫిక్స్​

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌ 2023) తదుపరి సీజన్‌ వేలం డిసెంబర్‌ 16న బెంగుళూరులో జరగనుంది. అయితే ఈ సారి ఐపీఎల్‌ పాత ఫార్మట్‌ ప్రకారం జరుగనుందని బిసిసిఐ తెలిపింది. 16వ సీజన్‌ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. 2019 నుంచి రెండు సీజన్‌లు భారత దేశం వెలుపలా జరిగాయి. భారత దేశంలో 2021 సీజన్‌ ప్రారంభమైంది. అయితే మధ్యలో కరోనా ఇన్‌ఫెక్షన్‌ కేసులు రావడంతో సీజన్‌ను యూఏఈకి మార్చాల్సి వచ్చింది.

2022 సీజన్‌ పూర్తిగా భారత దేశంలోనే జరిగింది. అయితే సీజన్‌లోని లీగ్‌ దశ మ్యాచ్‌లు కేవలం మూడు నగరాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీస్టేడియం, కోల్‌ కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియంలో ప్లే ఆఫ్‌లు జరిగాయి.
ఐపిఎల్‌ 2022 కోసవ జరిగిన మెగా వేలంలో , జట్లకు రూ 90 కోట్ల పర్స్‌ లభించింది. అయితే ఈ ఏడాది వేలం కోసం దానిని రూ 95 కోట్లకు పెంచవచ్చని తెలుస్తోంది. గతేడాది మెగా వేలం జరిగింది. అయితే ఈ సీజన్‌కు మినీ వేలం ఉంటుంది. బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బీసీసీఐ) ప్రెసిడెంట్‌ పదవి నుంచి వైదొలగేముందు, సౌరవ్‌ గంగూలీ స్టేట్‌ అసోసియేషన్‌కు పంపిన లేఖలో ఈ సారి లీగ్‌ను హోమ్‌, ఎవే ఫార్మట్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement