భారత్‌పై తొలి మ్యాచ్ గెలుపు గొప్పదనమంతా టీందేనని దక్షిణాఫ్రికా ఆటగాడు రస్సీ వాన్ డెర్ డుస్సేన్ చెప్పాడు. న్యూఢిల్లి లోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధించడం తెలిసిందే. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ రస్సీ వాన్ డెర్ డుస్సేన్ పైవిధంగా స్పందించాడు. ఇరుదేశాల మధ్య మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. అందులో తొలి మ్యాచ్ గురువారం ముగిసింది. రస్సీ వాన్ డెర్ డుస్సేన్, డేవిడ్ మిల్లర్ ద్వయం చెలరేగి ఆడడంతో భారత జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ” ఆడే అవకాశం రాకపోయినప్పటికీ ఇప్పటిదాకా అనేక ఐపీఎల్ మ్యాచ్‌లను తిలకించా. బౌలర్ల ఆటతీరుపై నాకు కొంత అవగాహన ఉంది” అని అన్నాడు. 46 బంతుల్లో 75 పరుగులు తీసిన రస్సీ వాన్ డెర్ డుస్సేన్ నాటౌట్‌గా నిలిచాడు.
ఇక డేవిడ్ మిల్లర్ 31 బంతుల కు 64 పరుగులు తీసినా ఔట్ కాలేదు. ఇది సఫరీల విజయానికి ఎంతగానో దోహదం చేసింది. చారిత్రక విజయం వారి ఖాతాలో నమోదైంది. 33 ఏళ్ల రస్సీ వాన్ డెర్ డుస్సేన్ …రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు. సంజు శ్యాంసన్ నాయకత్వంలో మూడు మ్యాచ్‌లు ఆడాడు. ” ఇక్కడ రెండు నెలలు గడిపా. ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుందో తెలుసు. వేడికి, చలికి అలవాటుపడ్డా. అందువల్లనే ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నా’ అని అన్నాడు. అంతటితో ఆగకుండా డేవిడ్ మిల్లర్‌పైనా ప్రశంసల జల్లు కురిపించాడు. మిల్లర్ కారణంగా తనపై ఒత్తిడి తగ్గిందన్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.