పారిస్ ఒలింపిక్స్-2024 సందర్భంగా అల్జెరియా మహిళా బాక్సర్ ఇమానే ఖలీఫ్ పేరు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆమె మహిళా కాదు పురుషుడని ఖలిఫ్ ప్రత్యర్థి బాక్సర్ వివాదస్పధ వాఖ్యాలు చేసింది. తొలి బౌట్‌లో ఇమానే తన ప్రత్యర్థి ఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీ కేవలం 46 సెకన్లలోనే చిత్తు చేసింది.
ఇమానే పంచ్‌లను తట్టుకోలేకపోయిన ఇటలీ బాక్సర్ ఏడుస్తూ బౌట్ మధ్యలోనే తప్పుకుంది. తనపై ఓ మగాడు దాడి చేసినట్లు అనిపించిందని ఆమె కన్నిటి పర్వం అయింది. అయితే ఈ వివాదాన్ని ఒలింపిక్ నిర్వాహకులు తోసి పుచ్చారు. దీంతో వరుస విజయాలతో ఖలీఫ్ ఫైనల్లో ప్రవేశించి చివరికి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
అయితే, ఇప్పుడు ఆమె జెండర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఇమానేకు సంబంధించిన లింగ నిర్దారణ రిపోర్టులు లీక్ అయ్యాయి. ఆమెలో పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్లు, (ఎక్స్,వై) క్రోమోజోమ్స్‌లు ఉన్నాయని ఓ ఫ్రెంచ్ జర్నలిస్టు వెల్లడించాడు.
దానికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని సంచలన ప్రటన చేశాడు. దీంతో మరోసారి ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. ఇమానే గెలిచిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాడు.