పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. కెప్టెన్ నికోలస్ పూరన్, హోప్‌తో కలిసి వికెట్లు పడిపోకుండా కొద్దిసేపు జాగ్రత్తగా ఆడారు. దీంతో నిర్ణీత ఓవర్లలో విండీస్ 311 పరుగులు చేసింది. ఆరంభంలోనే కైల్ మేయర్స్ (39) ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు. ముఖ్యంగా మేయర్స్ భారీ షాట్లు ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. మేయర్స్ అవుటైన తర్వాత వచ్చిన బ్రూక్స్ (35) కూడా ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత వచ్చిన కింగ్ (0) విఫలమైనప్పటికీ.. నికోలస్ పూరన్ (74)తో కలిసి హోప్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 134 బంతుల్లో (115) సెంచరీ పూర్తిచేసుకుని జట్టును పటిష్టమైన స్థితికి తీసుకొచ్చాడు.
అయితే.. 44 ఓవర్లో కెప్టెన్ పూరన్ శార్దూల్ వేసిన బంతికి పుల్ చేయబోగా బాల్ మిస్ అయ్యింది. దీంతో డైరెక్ట్‌గా వెళ్లి స్టంప్స్‌ని గిరాటేసింది. ఇట్లానికోలస్ పూరన్ అవుట్ కావడంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పోవేల్ (13), షెపర్డ్ 15, హోసన్ 06, పర్వాలేదనిపించారు. ఈ క్రమంలోనే విండీస్ జట్టు 50 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో శార్దూల్ 3 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, చాహల్, దీపక్ హుడా తలో వికెట్ తీసుకున్నారు.
టీమిండియా టార్గెట్ ————-312