ఆసియాకప్‌లో భాగంగా ఇవ్వాల (శుక్రవారం) భారత్, బంగ్లా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ హసన్ (13) పరుగులు చేయగా.. లిటన్ దాస్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక.. షకీబుల్ హసన్ (80) పరుగులతో ఆకట్టుకున్నాడు. హృదయ్ (54), నాసుమ్ అహ్మద్ (44) పరుగులతో రాణించారు. కాగా, మిగతా వారంతా సోసోగా ఆడారు.
కాగా, టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ కృష్ణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక.. ఇండియా 266 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కు దిగనుంది.
- Advertisement -