ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోంది. అలాగే బిసిసిఐ సహకారంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరిన్నీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరిపించేందుకు కృషి చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
వైజాగ్ లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం రాష్ట్రంలోని 13 జిల్లాల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులతో రెండు రోజుల సమీక్షా సమావేశం నిర్వహించారు.
అలాగే వైజాగ్ స్టేడియాన్ని ఎసిఎ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎసిఎ అధ్యక్షుడు,ఎంపి కేశినేని శివనాథ్ నార్త్ జోన్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశమై క్రికెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా ఎసిఎ అధ్యక్షుడు,ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విశాఖ స్టేడియంలో మరిన్నీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరిపించేందుకు అనుకూలంగా అంతర్జాతీయ ప్రమణాలతో కూడిన వసతులు కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుకోవటంతో పాటు జిల్లాల్లోని క్రికెట్ గ్రౌండ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక విజయనగరంలో ఉన్న నార్త్ జోనే క్రికెట్ అకాడమీని అప్ గ్రెడేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో ఏసీఏ కార్యదర్శి సానా సతీష్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్ లతో పాటు పలు జిల్లా ల క్రికెట్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.