భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటికే ఆయా దేశాలు తమతమ జట్లను ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా 15 మందితో కూడిన ప్రపంచకప్ జట్టును బుధవారం ప్రకటించింది. అఫ్గాన్ జట్టుకు హస్మతుల్లా షాహిదీ సారథ్యం వహించనున్నాడు.
మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్, ముజీబుర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. గత ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీతో గొడవపడి అందరి దృష్టిలో పడిన నవీన్ ఉల్ హక్ తాజాగా ప్రపంచకప్-2023 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. భారత్‌లో క్రికెట్ ఆడిన అనుభవం ఉండటంతో నవీన్‌ను జట్టులో చోటు కల్పించామని అఎn్గాన్ టీమ్ సెలెక్టర్లు తెలిపారు.
ఈ మెగా టోర్నీ కోసం ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా అఎn్గాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. వీరిలో గుల్బదీన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్‌లు ఉన్నారు. రెగ్యులర్ జట్టులో ఎవరైనా గాయాలు లేదా ఇతర కారణాలతో వైదొలిగితే వారి స్థానాల్లో రిజర్వ్ ఆటగాళ్లు జట్టులో చేరుతారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 7న అఎn్గానిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
ప్రపంచకప్ అఫ్గానిస్తాన్ జట్టు
హస్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, అబ్దుల్ రహ్మాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మాద్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫారూఖీ.
రిజర్వ్ ప్లేయర్లు: గుల్బదీన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్.