ఢిల్లీ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ చివరి బంతికి వార్నర్ అవుటయ్యాడు. ఆ తర్వాత అందరి దృష్టీ డగౌట్‌పై పడింది. రిషభ్ పంత్ హెల్మెట్ సరి చేసుకుంటూ మైదానంలోకి అడుగు పెట్టాడు. దాంతో ఒక్కసారిగా ముల్లన్పూర్ స్టేడియం మొత్తం మార్మోగిపోయింది.
అభిమానులంతా నిలబడి స్టాండింగ్ ఒవేషన్‌తో స్వాగతం పలికారు. దాదాపు 15 నెలల విరామం తర్వాత క్రికెట్లోకి అడుగు పెట్టిన పంత్‌లో కూడా భావోద్వేగాలు కనిపించాయి.
బ్రార్ ఓవర్లో తన రెండో బంతికి సింగిల్ తీసి అతను పరుగుల ఖాతా తెరవడంతో అంతా చప్పట్లతో అభినందించారు. స్కోరు పరంగా పంత్ గొప్పగా ఆడకపోయినా…దాదాపు చావుకు చేరువైన కారు ప్రమాదంనుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడు పూర్తి ఫిట్‌గా, కీపింగ్‌లోనూ చురుగ్గా కనిపించడం సానుకూలాంశం. రానున్న రోజులలో తన ట్రేడ్ మార్క్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.