ఐపీఎల్ సీజన్ – 2022ను విజయం వంతం చేసినందుకు ప్రతీ ఒక్కరికి బీసీసీఐ కార్యదర్శి జై షా ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా.. కరోనా మహ మ్మారి పంజా విసరకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా రనంటూ ప్రశంసించారు. గ్రౌండ్ స్టాఫ్ నుంచి క్యూరేట ర్‌లు, అంపైర్ల వరకు ప్రతీ ఒక్కరు ఎంతో కష్టపడ్డారన్నారు. ఈ సందర్భంగా గ్రౌండ్‌మె న్స్‌తో పాటు క్యూరేటర్లకు రూ.1.25 కోట్ల రివార్డును ప్రకటిస్తున్నట్టు జైషా వివరించారు. 2022 టాటా ఐపీఎల్ మొత్తం 6 వేదికల్లో కొనసాగిందని గుర్తు చేశారు. ప్రతీ వేదికను ఎంతో బాగా ముస్తా బు చేశారని, ఎలాంటి అవాం ఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారని వివరించారు.
తెరపైకి కనిపిం చని హీరోలు క్యూరేటర్స్, గ్రౌండ్‌మెన్స్ అని జైషా చెప్పుకొచ్చాడు. ఇక మైదాన్ని సిద్ధం చేయడంలో సిబ్బంది కూడా ఎంతో కృషి చేశారన్నారు. సీసీఐ, వాంఖడే, డీవై పాటిల్, ఎంసీఏ, పుణ ఒక్కో మైదాన నిర్వాహకులకు రూ.25లక్షలు కేటాయి స్తున్నట్టు వివరించారు. అదేవిధంగా ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోడీ స్టేడి యంలకు రూ.12.50 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..