మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఈరోజు (శనివారం) జరిగిన మ్యాచ్ లో థాయ్‌లాండ్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో మలేషియాపై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ మలేషియా ముందు 134 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. థాయ్‌లాండ్ బ్యాటింగ్‌లో నన్నపట్ కొంచరోంకై (40), ఫన్నిటా మైయా (29) అదరగొట్టారు. ఆ తర్వాత ఛేజింగ్ ప్రారంభించిన మలేషియా 111 పరుగులకే పరిమితం చేసిన థాయ్‌లాండ్… 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే, స్వల్ప ఛేదనలో మలేషియా ఓపెనర్ వాన్ జూలియా (52) హాఫ్ సెంచరీతో థాయ్ బౌలర్లపై విరుచుకుపడింది. కెప్టెన్ వినిఫ్రెడ్ దురైసింగం (22) పరుగులు సాధించింది. అయితే మిగిలిన బ్యాటర్లు కనీసం 10 పరుగులు కూడా చేయలేకపోయారు. దాంతో మలేషియా అనూహ్యంగా ఓటమి పాలైంది. మెగా టోర్నీలో శుభారంభం చేసిన థాయ్ లాండ్ గ్రూప్ బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.