థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. ఇవ్వాల (శనివారం) జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనలో అష్మిత పరాజయంపాలైంది. స్థానిక క్రీడాకారిణి సుపనిదా కతేథాంగ్‌తో తలపడిన అష్మిత.. వరుస గేమ్‌లలో 13-21 12-21 తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో భారత్ షట్లర్ అష్మితా చలిహా ఆకట్టుకునే పరుగు ముగిసింది.
ఇక నిన్న (శుక్రవారం) జరిగిన మ్యాచ్‌లో పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మిథున్ మంజునాథ్, మహిళల డబుల్స్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్ జోడీ థెరిసా జాలీ-గాయత్రి గోపీచంద్ లు ఓటమిపాలయ్యారు.