థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి అష్మిత సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇవ్వాల (శుక్రవారం) జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్‌లో.. ఇండోనేషియాకు చెందిన ఎస్టర్ నురుమి వార్డోయోపై వరుస గేమ్‌లలో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది అశ్మిత చలిహా.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మిథున్ మంజునాథ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మిథున్ 19-21, 15-21తో నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ కల్జౌవ్ చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ జోడీ థెరిసా జాలీ-గాయత్రి గోపీచంద్ కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఒక గంటా ఏడు నిమిషాల పాటు సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో థెరిసా-గాయత్రి జోడీ 12-21, 21-17, 21-23 పాయింట్ల తేడాతో ఇండోనేషియాకు చెందిన ఫెబ్రియానా ద్విపూజి కుసుమ-అమాలియా కహాయా ప్రతివి చేతిలో ఓడిపోయింది.
దీంతో థాయ్‌లాండ్ మాస్టర్స్‌లో భారత్ తరఫున ఆడుతున్న ఏకైక ప్లేయర్‌గా అశ్మితా చలిహా నిలిచింది. క్వార్టర్స్‌లో వార్డోయోపై 21-14, 19-21, 21-13 తేడాతో విజయం సాధించిన అశ్మిత తన తదుపరి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కథేథోంగ్‌తో తలపడనుంది.