న్యూజిలాండ్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. తన స్పిన్ తో న్యూజిలాండ్ ఫేట్ ను తిప్పేస్తున్నాడు. ఫలితంగా న్యూజిలాండ్ 3.15 గంటలకు.. 129 ఓవర్లలో 270 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. దీంట్లో అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయడం గమనార్హం..
న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యాడు. కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఇండియన్ బౌలర్లు దూకుడు పెంచారు. అక్షర్ పటేల్ 5 వికెట్లు తీసుకోగా.. ఉమేశ్ యాదవ్, అశ్విన్, జడేజాలు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కడపటి వార్తలు అందేసరికి.. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 270 రన్స్ చేసింది. జేమిసన్, సోమర్ విలే క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 345 రన్స్ చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..