Saturday, November 23, 2024

Test Match: మూడోరోజు.. లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ స్కోరు 210/2

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. ఇవ్వాల మూడో రోజు. కాగా ఈ రోజు లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 148 పరుగులు వెనకబడి ఉంది. మార్నింగ్‌ ఓవర్ నైట్ స్కోరు 129/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఏమాత్రం తడబడకుండా, నిన్నటి జోరునే కొనసాగించింది. అయితే.. దూకుడుగా ఆడుతున్న‌ కివీస్ ఓపెన్లను ఎట్టకేలకు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విడదీశాడు.

టీమిండియా స్పిన్న‌ర్ అశ్విన్ 67వ ఓవర్‌లో వేసిన‌ తొలి బంతికి విల్ యంగ్ (89) కీపర్‌కు చిక్కి తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. 151 పరుగుల ఫ‌స్ట్‌ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు క్రీజులో పాతకుపోయిన టామ్ లాథమ్ (82) మాత్రం అదే జోరు కొనసాగిస్తూ స్కోరు బోర్డుపై పరుగులు జోడిస్తున్నాడు. అతడికి అండగా నిలిచిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 18 పరుగులు మాత్రమే చేసి ఉమేశ్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం 197 పరుగులు చేసిన కివీస్ భారత్ కంటే 148 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేసింది.

లంచ్ బ్రేక్ త‌ర్వాత టామ్ లాథ‌మ్‌కు జోడీగా రాస్ టేల‌ర్ వ‌చ్చాడు. వీరిద్ద‌రు క‌లిసి స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టిస్తఉన్నారు 90.2 ఓవ‌ర్ల‌లో న్యూజిలాండ్ 210/2 ప‌రుగుల‌తో మ్యాచ్ కొన‌సాగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement