న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో మూడో రోజు ఆటలో టీమిండియా 234 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత డిక్లెర్ చేస్తూ న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది భారత్. నాలుగో రోజు ఉదయం పుజారా (22), అజింక్య రహానే (4) మయాంక్ అగర్వాల్ (17) పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత జడేజా (0) డకౌట్ అవడంతో భారత్ పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది. అయితే శ్రేయాస్ అయ్యర్ (65), అశ్విన్ (32) జట్టును ఆదుకున్నారు.
కాసేపటికి అశ్విన్ వెనుతిరిగినా వృద్ధిమాన్ సాహా (34 నాటౌట్)తో కలిసి అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. అయ్యర్ వెనుతిరిగిన తర్వాత అక్షర్ పటేల్ (9 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 167 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్లు నష్టపోయి 234 పరుగులు చేసింది. దీంతో ఇండియా ఫస్ట్, సెకండ్ ఇన్సింగ్స్ కలిపి మొత్తం పరుగులు 579గా ఉన్నాయి. కాగా, న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 296పరుగులు చేసింది. దీంతో మొత్తంగా న్యూజిలాండ్‌పై భారత్ 283 పరుగులు ఆధిక్యంలో ఉంది.. రేపటి లోగా న్యూజిలాండ్‌ను పూర్తిగా ఆల్ అవుట్ చేస్తే.. సిరిస్‌లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచినట్టు అవుతుంది..