Wednesday, July 3, 2024

Tennis | మ‌రికొద్ది సేప‌ట్లో వింబుల్డ‌న్..

ప్ర‌తిష్ఠాత్మ‌క గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డ‌న్ నేటి నుంచి ప్రారంభం అవుతొంది. ఈ నెల‌ 14 వ‌ర‌కు టోర్నీ జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ టోర్నీ ప్ర‌మోష‌న్స్‌ను వింబుల్డ‌న్ సోష‌ల్ మీడియా పేజీ వెరైటీగా మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగానే భార‌తీయ చిత్రాల పేర్ల‌ను ప్రేర‌ణ‌గా తీసుకుని ప్ర‌త్యేక పోస్ట‌ర్ల‌ను రూపొందించి విడుద‌ల చేసింది.

దీనిలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన సూప‌ర్ హిట్ మూవీ ‘పుష్ప’ పోస్ట‌ర్‌ను తీసుకుని గ‌తేడాది వింబుల్డ‌న్ టైటిల్ గెలిచిన‌ డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల‌స్ అల్కారాజ్‌తో ‘అల్కారాజ్‌3’ అంటూ ఒక పోస్ట‌ర్ విడుద‌ల‌ చేసింది. అలాగే ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ను ప్రేరణ‌గా తీసుకోని ‘వింబుల్డ‌న్ బాయ్స్’ అంటూ ఈ టోర్నీలో ఆడుతున్న కీల‌క ప్లేయ‌ర్లతో మ‌రో పోస్ట‌ర్‌ను రిలీజ్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్లు సామాజిక మాధ్య‌మాల్లో తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల‌స్ అల్కారాజ్‌తో పాటు వ‌ర‌ల్డ్ నం. 01 జ‌న్నిక్ సిన్న‌ర్‌, నోవాక్ జ‌కోవిచ్‌లు టైటిల్‌ ఫేవ‌రెట్లుగా బ‌రిలోకి దిగుతున్నారు. అయితే, మోకాలి శ‌స్త్ర చికిత్స‌ నుంచి కోలుకున్న జ‌కోవిచ్‌కు వింబుల్డ‌న్‌లో సిన్న‌ర్, అల్కరాజ్‌ల రూపంలో గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశ‌ముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement