Saturday, October 5, 2024

Tennis | ప్రీ క్వార్టర్స్‌లో సిన్నర్‌, జ్వెరెవ్‌

ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ జన్నిక్‌ సిన్నర్‌, నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌లు ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో వరల్డ్‌ నెం.1 జన్నిక్‌ సిన్నర్‌ 6-1, 6-4, 6-2 తేడాతో సెర్బియాకు చెందిన మియోమిర్‌ కెక్‌మనోవిక్‌ను వరుస సెట్లలో చిత్తు చేసి టోర్నీలో ముందంజ వేశాడు.

నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-4, 6-4, 7-6 (17-15) తేడాతో కామెరోన్‌ నోర్నీ (యూకే)పై చెమటోడ్చి నెగ్గాడు. తొలి రెండు సెట్లను సునాయానంగానే గెలిచిన జ్వెరెవ్‌కు మూడో సెట్‌లో మాత్రం స్థానిక ప్లేయర్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. సుదీర్ఘంగా సాగిన ఈ ఆఖరి సెట్లో అలెగ్జాండర్‌ గేమ్‌ పాయంట్లో విజయాన్ని దక్కించుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement