Sunday, November 10, 2024

Tennis – ఆస్ట్రేలియన్ ఓపెన్‌ లో కొత్త ఛాంపియన్‌ – టైటిల్ గెలిచిన తొలి ఇటాలియన్ సిన్నర్

పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కొత్త ఛాంపియన్‌ అవతరించాడు. ఇటాలియన్‌ యువ టెన్నిస్‌ ప్లేయర్‌ జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచాడుఈరోజు జరిగిన టైటిల్ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్‌ను ఐదు సెట్లలో ఓడించాడు. ఈ మ్యాచ్‌లో సిన్నర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్ గెలిచిన తొలి ఇటాలియన్ ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు.

ఈ మ్యాచ్ లో తొలి రెండు సెట్లు మెద్వెదెవ్ బాగా ఆడి.. అతను మ్యాచ్ గెలిచేలా చేశాడు. కానీ.. జానిక్ సిన్నర్ పదునైన సర్వీసులు, కచ్చితమైన ప్లేస్ మెంట్ల, బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో మెద్వెదెవ్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో జానిక్ సిన్నర్ తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించాడు. మెద్వెదేవ్ గతంలో 2021లో యుఎస్ ఓపెన్ గెలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన సిన్నర్ కు ట్రోఫీతో పాటు రూ.26 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ గా నిలిచిన మెద్వెదెవ్ కు రూ.14 కోట్లు దక్కాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement