భారత టాప్ అథ్లెట్ ద్యుతీచంద్ తాత్కాలికంగా సస్పెన్షన్‌కు గురైంది. డోపింగ్ టెస్టులో పట్టుబడడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ”శాంపిల్-ఏ” టెస్టు రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నిషేధిత సార్స్ ఉత్పేరకం వాడినట్లు తేలడంతో ద్యుతీచంద్‌పై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ”ద్యుతీ మూత్ర నమూనాను జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబ్‌లో పరీక్ష చేయించాం. అండరైన్, ఓస్టారిన్, లిగాండ్రోల్ స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు తేలింది. అందుకు సంబంధించిన పూర్తి నివేదికలను పంపుతున్నాం. క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన నివేదికలను జోడిస్తున్నాం” వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ లేఖ రాసింది.
దీనిపై ద్యుతీ చంద్ స్పందిస్తూ… తాను డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు తనకు తెలియదని పేర్కొంది. 2019లో యూనివర్సైడ్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్‌గా ద్యుతీచంద్ రికార్డులకెక్కింది. 2018 ఆసియా గేమ్స్ లో 100, 200 మీటర్ల విభాగంలో ద్యుతీచంద్ రజత పతకాలు సొంతం చేసుకుంది. 2013, 2017, 2019 ఆసియా చాంపియన్‌షిప్స్‌లో ద్యుతీ చంద్ కాంస్య పతకాలు సాధించింది.