విశాఖపట్నం- విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ టీమ్‌ని ఓడించి తెలుగు వారియర్స్ టైటిల్‌ని కైవసం చేసుకుంది. తెలుగు వారియర్స్ కు ఇది నాలుగో టైటిల్ .. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కి దిగిన భోజ్‌పురి దబాంగ్స్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 72 చేసింది. తర్వాత అఖిల్ 32 బంతుల్లో 67 పరుగులు చేయడంతో తెలుగు వారియర్స్ 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భోజ్‌పురి దబాంగ్స్ 6 వికెట్లు నష్టానికి 89 పరుగులే చేయగలిగింది. దీంతో తెలుగు వారియర్స్ ముందు 58 పరుగుల లక్ష్యం ఉంచింది. ఆ లక్ష్యాన్ని కేవలం వికెట్ నష్టపోయి తెలుగు వారియర్స్ చేధించింది..
ఈ టైటిల్‌ని గెలవడం తెలుగు వారియర్స్‌కి ఇది నాలుగో సారి కావడం విశేషం. ఎక్కువ టైటిల్స్ గెలిచిన టీమ్‌గా రికార్డ్ సృష్టించింది. ఇంతకుముందు 2015, 2016, 2017లో వరుసగా గెలిచి తెలుగు వారియర్స్ హ్యట్రిక్ టైటిల్స్ సాధించింది. కాగా, అనంతరం కరోనా కారణంగా మూడేళ్లు గ్యాప్ వచ్చింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అఖిల్ నిలిచాడు.