Monday, November 18, 2024

టీమిండియా గ్రేట్ విక్ట‌రీ.. కొత్త రికార్డు నెలకొల్పిన హిట్‌మ్యాన్..

న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా త‌న స‌త్తా చాటింది. మూడో టీ20లోనూ ఘ‌న‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ఇచ్చిన 184 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ఏ దశలోనూ చేరుకోలేక పోయింది. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోతూ దిక్కుతోచ‌ని స్థితికి చేరింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు రాణించి అద్భుత విజయం సొంతం చేసుకున్నారు.

న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన, ధోని, కోహ్లీలకు సాధ్యం కాని రికార్డును సాధించింది. న్యూజిలాండ్ టీం కేవలం 17.2 ఓవర్లకు 111పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో రోహిత్ సేన 73 పరుగులతో ఘన విజయం సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 185 భారీ లక్ష్యాన్ని ఉంచింది.

కీలక మ్యాచులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (56 పరుగులు, 31 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు), ఇషాన్ కిషన్ (29 పరుగులు, 21 బంతులు, 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం వికెట్లు వెంటవెంటనే పడడంతో మిడిలార్డర్‌లో భారత్‌ చాలా ఇబ్బంది పడింది. సూర్యకుమార్ యాదవ్ 0, రిషబ్ పంత్ 4 వికెట్లు త్వరగా పడ్డాయి. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్(25 పరుగులు, 20 బంతులు, 2 ఫోర్లు), వెంకటేష్ అయ్యర్(20 పరుగులు, 15 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) మరో కీలక భాగస్వామ్యాన్ని అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement