Tuesday, November 26, 2024

శ్రీలంక ఘోర ప‌రాజ‌యం – 317 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం..

తిరువనంతపురం: టీమ్ ఇండియాతో నేడు తిరువ‌నంత‌పురం లో జ‌రిగిన మూడో వ‌న్డే లో శ్రీలంక ఘోర ప‌రాజ‌యం పొందింది..భార‌త్ నిర్దేశించిన 371 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 73ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.. దీంతో భార‌త్ 317 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.. శ్రీలంక బ్యాట‌ర్ అసెన్ బండారా ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ‌టంతో బ్యాటింగ్ కు రాలేదు.. కాగా, టీమిండియా నిర్దేశించిన 391 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగుల వద్ద ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (1)ను సిరాజ్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత మరింతగా చెలరేగిన సిరాజ్ మ‌రో బ్యాట‌ర్ నువనిదు ఫెర్నాండో (19)ను బౌల్డ్ చేశాడు. అదే ఊపుతో కుశాల్ మెండిస్ (4), వనిందు హసరంగ (1)లను పెవిలియన్ పంపాడు. చరిత్ అసలంక (1)ను షమీ అవుట్ చేశాడు. అలాగే, చమిక కరుణ రత్నె(1). సిరాజ్ బౌలింగులోనే రనౌట్ అయ్యాడు. కెప్టెన్ స‌న‌క‌ను 11 ప‌రుగుల‌కు కుల‌దీప్ బౌల్డ్ చేశాడు..దునీత్ ను 3 ప‌రుగుల‌కు ష‌మీ పెవిలియ‌న్ కు చేర్చాడు. ఇక తొమ్మిది ప‌రుగులు చేసిన ల‌హిరి కుమారాను కుల‌దీప్ ప‌డగొట్టాడు.. భార‌త్ బౌల‌ర్ల‌లో సిరాజ్ కు నాలుగు వికెట్లు ల‌భించ‌గా, ష‌మీ,కుల‌దీప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.. శ్రీలంక ప‌త‌నం కేవ‌లం 22 ఓవ‌ర్ల‌లోనే కావ‌డం విశేషం..అంతకుముందు శుభమన్ గిల్ (116), కోహ్లీ (166, నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. మూడు మ్యాచ్ సిరీస్ లో అన్నింటిని గెలిచిన భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement