న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఇవ్వాల (ఆదివారం) జరిగిన టీ20 సెకండ్ మ్యాచ్‌లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పరంగా బెస్ట్‌గా నిలిచింది. టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో సెంచరీ (111*) పరుగులు నమోదు చేసుకుని రికార్డు సాధించగా.. ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది భారత జట్టు..
ఇక.. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 126/10తో ఓటమి చెందింది. ఇందులో భువనేశ్వర్ 1, మహ్మద్ సిరాజ్ 2, వాషింగ్టన్ సుందర్ 1, చాహల్2, దీపక్ హుడా 4 వికెట్లు తీసి న్యూజిలాండ్ వెన్నువిరిచేశారు. కాగా, కేన్ విలియమ్స్ (61), డివోన్ కాన్వాయ్ (25), ఫిలిప్స్ (12), మిచ్చెల్ (10) పరుగులు మినహా.. మరే ఇతర ఆటగాడు పెద్దగా స్కోరు చేయలేక చేతులెత్తేశారు. దీంతో భారత జట్టు 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.